గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మహిళలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాలు అమలు చేసిన నేపథ్యంలో బుధవారం సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మహిళలు భారీగా హాజరయ్యారు.ముందుగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసి పీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే పథకాలన్నీ అమలు చేయడంపై ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.