సత్యసాయి జయంతి వేడుకలకు సంబంధించిన పనులు పురోగతిపై అధికారులతో మంత్రుల సమీక్ష
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్లో శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన పనుల పురోగతిపై మంగళవారం సాయంత్రం రాష్ట్ర మంత్రుల బృందం అధికారులతో సమీక్షించింది. ఈ సమీక్షలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, ఆనం రామనారాయణరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణ బాబు, అజయ్ జైన్, కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పనుల ప్రగతిని అధికారులు మంత్రులకు వివరించారు.