మహదేవ్పూర్: కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని ఈరోజు శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు - పద్మ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు వేదమంత్రోచ్చరణల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు శ్రీ ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఫణీంద్ర శర్మ వారి అర్చక బృందం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, శేష వస్త్రాలతో ఎమ్మెల్యే దంపతులకు సన్మానం చేసి ఆశీర్వదించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు.