కరీంనగర్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే జైలుకు పంపుతాం : రూరల్ CI నిరంజన్ రెడ్డి
ఆదివారం ఉదయం కరీంనగర్ రూరల్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన దర్శనాల లక్ష్మణ్ అనునతడు తన ట్రాక్టర్ మరియు ట్రైలర్స్ నందు అక్రమంగా, దొంగతనముగా గొల్లపల్లి శివారులోని మానేరు వాగు ఇసుకను తరలిస్తుండగా అతడిని పట్టుకొని ట్రాక్టర్ తో సహా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్టులో హజరు పరుస్తునట్లు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ రూరల్ పరిధిలో ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు.