సంగారెడ్డి: కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డిలో భక్తులతో కిటకిట లాడిన ఆలయాలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డిలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివాలయాలకు ఉదయం 5 గంటల నుంచి భక్తులు బారులు తీరారు.శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి దీపాలను వెలిగించారు. భక్తులు భారీగా వస్తుండడంతో ఆలయాల కమిటీ సభ్యులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోతిరెడ్డిపల్లిలోని కేతకి సంగమేశ్వర మందిరం, వీరభద్ర స్వామి దేవాలయం, పార్వతి సంగమేశ్వర ఆలయాలు భక్తులతో సందడిగా కనిపించాయి. 7