పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తుది దశకు చేరింది. భూమి లోపల 35 మీటర్ల లోతున చేపట్టిన ఈ పనులు 99 శాతం పూర్తయ్యాయి. దీనిపై 34 మీటర్ల ఎత్తుతో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ECRF) నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఈ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు బుధవారం పోలవరంలో పర్యటించనున్నారు.