సిర్పూర్ టి: బెజ్జూరు వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం అధికారులను నిలదీసిన రైతులు
బెజ్జూరు మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వచ్చిన రైతులు అధికారులను నిలదీశారు. ఉదయం నుండి గోదం వద్ద వేచి ఉన్న రైతులకు ఏఈఓ యూరియా లేదు అనడంతో నిలదీశారు. గోదం తలుపులు తెరిచి చూపించాలని ఏఈఓ ను నిలదీయడంతో చేసేదేమి లేక గోధంలో యూరియా స్టాక్ ను చూపించారు. యూరియా స్టాక్ వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు అక్కడి నుండి వెనుతిరిగారు,