ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో సోమవారం పేకాట ఆడుతున్న ఆరుగురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.63,500 నగదును స్వాధీనం చేసుకున్నట్టు సీఐ దాసరి ప్రసాద్ మీడియాకు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు డైల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని సీఐ విజ్ఞప్తి చేశారు.