బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని 16 నెంబర్ జాతీయ రహదారి పక్కన గురువారం గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వివరాలు తెలియలేదని గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.