పూతలపట్టు: ఆరోగ్యం డబ్బుతో కొనలేని అమూల్యమైన సంపద : యాదమరి డాక్టర్ అనిల్ కుమార్ నాయక్
“ఆరోగ్యం అరువు తెచ్చుకునే వస్తువు కాదు, సకాలంలో వైద్యం పొందితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించవచ్చు” అని యాదమరి వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ అన్నారు. మండలంలోని కీనాటంపల్లి గ్రామంలో నిర్వహించిన “ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన కుటుంబం” కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డబ్బులతో కొనలేని అమూల్యమైన సంపద ఆరోగ్యం అని ప్రజలందరూ గుర్తించుకోవాలని సూచించారు.