భూములు ఇస్తే భూమి ఇచ్చిన కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇస్తామని పంగనామం
భూములు ఇస్తే భూమి ఇచ్చిన కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి లెదర్ ఫ్యాక్టరీ యాజమాన్యం పంగనామం పీకిందని రైతులు వాపోయారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ఈమెరకు మహిళల ఇన్చార్జి డిఆర్ఓ కు ఫిర్యాదు చేశారు.శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం రాళ్ల అనంతపురం వద్ద సర్వే నంబర్లు 28,29,32,33 లో 23.89 ఎకరాల భూమిని లెదర్ ఫ్యాక్టరీ కోసం కేటాయించారన్నారు .భూములు ఇచ్చే క్రమంలో భూములు ఇచ్చిన ప్రతి కుటుంబంలోనూ ఒక్కొక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదని మహిళలు వాపోయారు.