రేణిగుంట గుత్తి వారి పల్లి గ్రామ సచివాలయ సమీపంలోని పంట పొలాలలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గుత్తి వారి పల్లి గ్రామ సచివాలయ సమీపంలో గల పంట పొలాలలో ఒక గుర్తిరిని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు అక్కడ స్థానికులు రేణిగుంట పోలీసులకు తెలపగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా వ్యక్తి సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉంటాడని తెలిపారు అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు బహుశా అతిగా మద్యం సేవించి మరణించి ఉంటాడని రేణిగుంట పోలీసులు భావిస్తున్నారు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు