మేడ్చల్: రామంతపూర్ లో కరెంట్ షాక్ కొట్టి వ్యక్తి మృతి
విద్యుత్ శాఖ డైలీ లేబర్ సేవియా నాయక్ మంగళవారం పనిచేస్తుండగా కరెంటు షాక్ కొట్టి మరణించాడు. రామంతపూర్ గోకుల్ నగర్ లో నివసిస్తున్న సేవియా నాయక్ విధుల్లో భాగంగా విద్యుత్ పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో వెనకాలే ఉన్న కరెంటు వైరకు చేయికి తాకి షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ప్రాణాలు పోయాయని బాధ్యత కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.