పాణ్యం: గుట్టపాడు ఎస్సీ కాలనీలో మరుగుదొడ్ల సమస్య పరిష్కరించాలి : CPM పార్టీ మండల కార్యదర్శి నాగన్న
ఓర్వకల్లు మండలం గుట్టపాడు ఎస్సీ కాలనీలో మరుగుదొడ్లు, సైడు కాలువల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి బి. నాగన్న డిమాండ్ చేశారు. మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.