కెరమెరి మండల కేంద్రంలో శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా కెరమెరి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులర్పించి,వారి సేవలను స్మరించుకున్నారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి సేవలు వెలకట్టలేనివని, వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని స్థానిక ఎస్ఐ మధుకర్ అన్నారు.