జాజిరెడ్డి గూడెం: ఆర్వపల్లి రైతు సేవా సహకార సంఘం కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ధర్నా
జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని ఆర్వపల్లి రైతు సేవా సహకార సంఘం కేంద్రం వద్ద శనివారం యూరియా కోసం రైతులు ధర్నా నిర్వహించారు. వరి పంట వేసి నెలలు గడుస్తున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.