అలంపూర్: స్వదేశి వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలి- బీజేపీ
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలతో బోయ నాగరాజు సమావేశం నిర్వహించారు. అనంతరంవారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయుల H1B వీసా రుసుము పెంపు అంశంపై మాట్లాడుతూ ... డోనాల్డ్ ట్రంప్ భారతదేశంపై కక్షపూరితంగా అమెరికా దేశంలో టేక్ కంపెనీలలో అత్యధిక మొత్తంలో భారతీయులు 71%ఉద్యోగాలు చేస్తూ ఉన్నారని కక్షపూరితంగా భారతదేశాన్ని తన దారిలోకి తీసుకువచ్చేందుకు అన్యాయమైన చర్యలు తీసుకుంటున్నారని అందులో భాగంగా వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంపై మండిపడ్డారు.