నగరూర్లో పాత కక్షలతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరులో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాత కక్షలతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ. ఘర్షణలో సింహాద్రి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి యాడికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సింహాద్రి కి తలకు తీవ్ర గాయాలు అయ్యాయని సర్జరీ వార్డుకు తరలిస్తున్నామని అత్యవసర విభాగం వైద్యురాలు డాక్టర్ సౌమ్య తెలిపారు.