గజపతినగరం: కొండతామరాపల్లిలో విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను వృక్షం గుర్తింపు: సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టి ప్రత్యేక పూజలు
ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలలో కీలక ఘట్టమైన సిరి మానోత్సవానికి సంబంధించిన సిరి మానును గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో గుర్తించి బుధవారం బొట్టుపెట్టి ప్రత్యేక పూజలను ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస నాయుడు పైడితల్లి అమ్మవారి ఆలయ సహాయ కమిషనర్ కే శిరీష స్థానిక ప్రజాప్రతినిధులు భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.