మచిలీపట్నంలో ఇంజక్షన్ వికటించి చిన్నారి మృతి
Machilipatnam South, Krishna | Sep 15, 2025
మచిలీపట్నంలో ఇంజక్షన్ వికటించి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. నిమ్ముతో బాధపడుతున్న ఫాతిమా అనే చిన్నారిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యుడు ఇంజక్షన్ చేసిన కొద్దిసేపటికే చిన్నారి మరణించింది. దీంతో పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు.