ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిలకచర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని మొక్కజొన్న తోటలో 16 సంవత్సరాల యువకుడి మృతదేహం శుక్రవారం కలకలం రైతుంది. మొక్కజొన్న తోటలో యువకుడిని పూడ్చి పెట్టడంతో స్థానికులు కంగుతినారు. ఈ విషయాన్ని దోర్నాల ఎస్ఐ మహేష్ కు తెలియజేయడంతో సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు. నందిగూడెంకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు.