భూపాలపల్లి: లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ పెద్దకుంటపల్లిలో తీజ్ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.గురువారం ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లి(11వ వార్డు)లో జరిగిన లంబాడీల తీజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, పెళ్లికాని యువతులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పులేసి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ...ఈ తీజ్ పండుగలో పెళ్లికాని యువతులు ఆట పాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలు, విలువలను భావితరాలకు తీసుకువెళ్తుంద