కళ్యాణదుర్గం: కంబాలపల్లి లో గొల్ల బుడ్డమ్మ అనే మహిళ అదృశ్యం, పోలీసులకు ఫిర్యాదు
సెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన గొల్ల బుడ్డమ్మ అదృశ్యమైంది. గత సోమవారం ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారపడి చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో మంగళవారం గొల్ల బుడ్డమ్మ కనిపించడం లేదని భర్త ఈరన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు బుడ్డమ్మ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.