అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ గోపాలకృష్ణ తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒరిస్సా ప్రాంతం నుంచి నలుగురు వ్యక్తులు రెండు బైక్స్ పై హైదరాబాద్ కి 12 కిలోల గంజాయిని తరలిస్తుండగా చింతూరు వద్ద పట్టుకున్నామని చెప్పారు. వీరిని అరెస్టు చేయడంతో పాటు, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.