పెనుగొండలో ద్విచక్ర వాహనం ఢీకొన్న కారు ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Mar 28, 2026
శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న కారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న లేపాక్షి మండలం నాయన పల్లి గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. పెనుగొండ నుండి అమరపురం కు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పెనుగొండ లోని టిడిపి కార్యాలయం వద్ద ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.