మంత్రాలయం: జాబ్ కార్డు కలిగిన కూలీలందరితో ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాలి : పెద్ద కడబూరు ఏపీవో చంద్రశేఖర్
పెద్ద కడబూరు:జాబ్ కార్డు కలిగిన కూలీలందరితో ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాలని ఏపీవో చంద్రశేఖర్ సూచించారు. బుధవారం పెద్దకడబూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ఉపాధి కూలీల ఈకేవైసీ నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీలచే ఈకేవైసీ చేయించాలన్నారు. ఇందులో ఈసీ ఖాదర్ బాషా ఉన్నారు.