రూరల్ ఎమ్మెల్యేని తిట్టేండేందుకు మనసెలా వస్తుంది : టీడీపీ రూరల్ కార్యాలయ ఇంచార్జి చక్రవర్ధన్
ఆనం అరుణమ్మను జడ్పీ చైర్ పర్సన్ గా చేసేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరంతరం శ్రమించారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి అన్నారు. అప్పట్లో టీడీపీ తరఫున చిరమన శ్రీనివాసులు రెడ్డి సతీమణి పోటీ చేస్తే ఒకటికి ఎనిమిది సార్లు వారిని బతిమిలాడి, వారి నామినేషన్ను విత్ డ్రా చేసేలా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రమించారని అన్నారు. రూరల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాట్లాడారు.