మెదక్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఐ వెంకట్ రాజా గౌడ్
Medak, Medak | Sep 16, 2025 సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఐ వెంకట్ రాజా గౌడ్ సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ మంగళవారం సాయంత్రం సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో పోలీసులమంటూ ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే 1930కు సమాచారం అందించాలని సూచించారు. అపరిచిత వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడకూడదని, అలాగే గుర్తు తెలియని ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దని ప్రజలను హెచ్చరించారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.