గాజువాక: పెదగంట్యాడలో హాస్పిటల్ ను 24 గంటలు తెరచి ఉంచాలని, వైద్య సేవలు మెరుగుపరచాలని హాస్పిటల్ వద్ద ధర్నా
పెదగంట్యాడ హెల్త్ సెంటర్ లోని వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉంచాలని డాక్టర్లను పెంచాలని అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్య రామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెదగంట్యాడ హాస్పిటల్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ పెదగంట్యాడ గంగవరం, గాజువాక ప్రాంతంలో సుమారు 3000 మందికి పైగా కార్మికులు నివసిస్తున్నారు. కార్మికులు వారి కుటుంబ సభ్యుల వైద్య సౌకర్యాలు నిమిత్తం పెద్దగంట్యాడ లో వారి కొరకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం హెల్త్ సెంటర్ ని నిర్మించింది.