మేడ్చల్: శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞమహోత్సవంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
బాలానగర్ చేరబండ రాజు కాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం 32వ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యజ్ఞ మహోత్సవంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు, శేఖర్ యాదవ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.