దుబ్బాక: దుబ్బాక, లచ్చపేటలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూములను పరిశీలించిన సీపీ అనురాధ
దుబ్బాక లచ్చ పేట డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు స్ట్రాంగ్ రూమును సందర్శించారు సిపి అనురాధ.గార్డు సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సమయంలో ఎలాంటి సమస్య లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెద్దగుండవెల్లి, బొప్పాపూర్ గ్రామాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.