కంది మండలంలోని శంకర్ పల్లి రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. బైక్పై ముగ్గురు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య (55) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన పాండు, పోచయ్యలను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు