జగద్గిరిగుట్ట బస్టాప్ వద్ద జరిగిన కథతో హైదరాబాద్ ఉలికి పడింది. బాధితుడు రోషన్, నిందితుడు బాలేశ్వర రెడ్డి రౌడీషీటర్లని మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి వెల్లడించారు. చిన్నగా మొదలైన వివాదం కత్తితో దాడి చేసే అంతగా ముదిరిందన్నారు. నాలుగు ప్రత్యేక టీమ్ లో నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పాత గొడవే దీనికి దారి తీసి ఉండొచ్చని, త్వరలో వారిని పట్టుకుంటామన్నారు. మహమ్మద్ అనే వ్యక్తి రాకతో గొడవ ముదిరింది అని తెలిపారు.