కొండపి: కొండపి సింగరాయకొండ పరిసర ప్రాంతాలలో మోస్తరు వర్షాలు, ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం జిల్లా కొండపి, సింగరాయకొండ పరిసర ప్రాంతాలలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా మోస్తారు వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాలలో ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే సింగరాయకొండ ప్రాంతంలోని సముద్రతీరంలో జాలర్లు చేపల వేటకు వెళ్లేందుకు అధికారులు నిషేధించారు. మరో రెండు రోజులపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎంత మొత్తంలో వర్షపాతం నమోదయిందో అధికారులు వెల్లడించవలసి ఉంది.