ఈర్నపాడులో పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు
Nandyal Urban, Nandyal | Apr 1, 2026
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం వృద్ధులు పంచాయతీ కార్యాలయం దగ్గర పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి దగ్గరికి వెళ్లి పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గ్రామంలో ప్రతినెల పంచాయతీ కార్యాలయానికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్నట్లు భూమ నాగమ్మ ఆరోపించారు. ఇంటి దగ్గరకు వచ్చి పంపిణీ చేయాలని కోరారు.