ఎటపాక: మండలంలోని నందిగామ లో40 ఎకరాల్లో నీటమునిగిన మిరప పంట: ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు
ఎటపాక మండలం లో గోదావరి వరదతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నందిగామ తదితర ప్రాంతాల్లో మిరప పంట నీట మునిగింది. మరో రోజు నీటిలో ఉంటే మొక్కలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ. 20వేలు వరకు పెట్టుబడి పెట్టమని రైతులు ఆవేదన చెందుతున్నారు. నందిగమా గ్రామం పరిధిలో 40ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.