సత్తుపల్లి: సత్తుపల్లి శివారు తమ్మిలేరు బ్రిడ్జి కింద మహిళా మృతదేహం లభ్యం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులోని తమ్మిలేరు బ్రిడ్జి కింద ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.అయితే మృతదేహం కాకర్లపల్లి గ్రామానికి చెందిన కుంట మారేశ్వరిగా గుర్తించారు. మరేశ్వరి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతుంది.ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వచ్చిన మారేశ్వరి తమ్మిలేరు బ్రిడ్జి పై నుండి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.