అవనిగడ్డ: అదనపు నగదు అడిగితే చర్యలు: కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నం లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా దీపం-2 పథకం నిర్వహిస్తుందని, డెలివరీ సిబ్బంది అదరపు నగదు అడిగితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డికే. బాలాజీ తెలిపారు. బుధవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 226547 గ్యాస్ సిలిండర్లు ఇప్పటివరకు ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఎవరైనా అదనంగా నగదు అడిగితే 1967 ఫిర్యాదు చేయాలని సూచించారు.