మహిళలు బాలికలపై అత్యాచారాలు వేధింపులను పూర్తిస్థాయిలో కట్టడి చేస్తాం జిల్లా ఎస్పీ
శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా మహిళలు బాలికలపై అత్యాచారాలు వేధింపులను పూర్తిస్థాయిలో కట్టడి చేసే దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం తెలియజేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లు, పాత నేరస్తులకు ఆయా స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. మహిళల పట్ల నేరాలకు పాల్పడుతున్న వారిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి వారిలో మార్పు తీసుకురావాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు.