రాయదుర్గం: పేలుడు పదార్థాల రవాణా పై సోమలాపురం రైల్వే స్టేషన్ వద్ద రైలులో తనిఖీలు చేపట్టిన రైల్వే పోలీసులు
రైళ్లలో బాణాసంచా, ఇతర పేలుడు పదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు హెచ్చరించారు. డి.హిరేహాల్ మండలం సోమలాపురం రైల్వే స్టేషన్ లో ఆదివారం సాయంత్రం ప్యాసింజర్ రైలులో జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రయాణికులను తనిఖీ చేశారు. బ్యాగులు, ఇతర లగేజ్ లను తనిఖీలు చేశారు. రైలు లో ప్రయాణం చేసే సమయాల్లో పేలుడు పదార్థాలు తీసుకెళితే జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.