రంగాపురంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న లోని ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Nov 12, 2025 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం డి.రంగాపురంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్థులతో నేరుగా మమేకమై, వారి సమస్యలు, అభ్యర్థనలు, అభివృద్ధి సూచనలను స్వయంగా విన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ప్రతి గ్రామంలో రోడ్లు, తాగునీరు, వైద్య, విద్యాభివృద్ధి దిశగా ముందుకు సాగేలా చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కోట్ల తెలిపారు.