అనంతపురం నగరంలోని రహమత్ నగర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో రెడ్డి సాయికిరణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.