భూపాలపల్లి: రిలయన్స్ స్మార్ట్ పాయింట్ మోసం పట్ల వివాదాలు పరిష్కార కమిషన్ కోర్టు అసహనం,బాధితుడికి పరిహారం చెల్లించాలంటూ ఆదేశం
భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ శివారులో గల రిలయన్స్ కంపెనీకి చెందిన స్మార్ట్ పాయింట్ ఘరానా మోసంపై వరంగల్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో వినియోగదారుడు తడుక సుధాకర్ కు కొంత ఊరట లభించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ కు చెందిన తడుక సుధాకర్ అనే కొనుగోలుదారుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ లో గల రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో గత ఫిబ్రవరి నెలలో సరుకులు కొనుగోలు చేయగా, వస్తువుల బిల్లులో అదనంగా రూ.1285లు వేసినట్లు గుర్తించడం జరిగింది.