కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని ప్రభలవీడు గ్రామంలో సోమవారం అన్నదాత సుఖీభవ,రైతన్న మీకోసం కార్యక్రమంలో టిడిపి ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి రైతులను కలుసుకొని, అన్నదాత సుఖీభవ నిధుల జమ, సాంకేతిక, పరిపాలన సమస్యలను తెలుసుకున్నారు.రైతులు తెల్పిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని రితేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.