ఆందోల్: చింతకుంట శివారులోని మంజీరా నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్య0
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చింతకుంట శివారులోని చాముండేశ్వరి మంజీరా నదిలో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. అటుగా వెళుతున్న స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.