జమ్మలమడుగు: మైలవరం : రిజర్వాయర్ సిబ్బంది విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం - జలాశయం కార్య నిర్వాహక ఇంజనీరు
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలంలోని మైలవరం రిజర్వాయర్ సిబ్బంది తుఫాను వల్ల వచ్చిన వరద నీటి ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మైలవరం రిజర్వాయర్ కార్య నిర్వాహక ఇంజనీర్ ఆదివారం ప్రకటన ద్వారా తెలిపారు.ప్రస్తుతం మైలవరం రిజర్వాయర్లో 6.148 టీఎంసీల నీటి నిల్వ వుందన్నారు. గండికోట రిజర్వాయర్ నుండి మైలవరం జలాశయానికి 2000 క్యూసెక్కుల నీరు వస్తూ ఉందన్నారు. మైలవరం డ్యాం స్పిల్ వే గేట్ల నుండి 2183 క్యూసెక్కులు నీటి ప్రవాహం పెన్నానదికి నిరంతరం వెళ్తూ ఉందన్నారు.