రాయదుర్గం: రేకులకుంట లో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా ట్రైనీ కలెక్టర్ సచిన్ రావర్
రాయదుర్గం మండలంలోని రేకులకుంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ట్రైనీ కలెక్టర్ సచిన్ రావర్ తనిఖీ చేశారు. బుధవారం మద్యాహ్నం MEO లు ఇర్షాద్, వెంకటరమేష్ లతో పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ కు విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం రికార్డులు పరిశీలించి పాఠశాల హాజరు విద్యార్థుల, అధ్యాపకులతో బోధనతీరుపై అడిగి తెలుసుకున్నారు. మద్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.