పూతలపట్టు: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసిన బంగారు పాల్యం సిఐ కత్తి శ్రీనివాసులు
వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారు పాల్యం సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు వారి కథనం మేరకు మండలంలోని ఇంద్రానగర్ కు చెందిన మునస్వామి కుమార్తె మైధిలి 21 సం. ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ తో మూడేళ్ల క్రితం వివాహం జరిగిందని అన్నారు. మంగళవారం ఇందిరానగర్ కు వచ్చి సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో బుధవారం రాత్రి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు