మెదక్: మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు : బిజెపి నాయకులు
Medak, Medak | Sep 18, 2025 రామయంపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా ఓబిసి జిల్లా కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛభారత్ కార్యక్రమనికి రాష్ట్ర జిల్లా నాయకులు హాజరయ్యారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు రామయంపేట మున్సిపాలిటీ పరిధిలో వందలాదిమంది విశ్వ జ్వరాల బారిన పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.