నల్లచెరువులోని హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో గల పొలాలలో క్షుద్ర పూజల కలకలం
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలోని కదిరి మదనపల్లి హైవేలో హెచ్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పొలాలలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ముగ్గుల పొడి, కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, టెంకాయలు, కోడిగుడ్లు, బూడిద పొడి తదితర పదార్థాలతో దాట్లు వేశారు. ఎవరో క్షుద్ర పూజలు నిర్వహించారని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువైపుగా వెళ్లడానికి సంకోచిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.